Alcohol : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మద్యం మత్తులో ఊగుతున్నారు. స్నేహితుల కారణంగా, ఆర్థిక పరిస్థితుల వల్ల అందరూ మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. చేసే పనుల్లో ఒత్తిడి కూడా ఈ మద్యం సేవించడానికి కారణమవుతుంది. ఈ అలవాటును మానుకోలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మద్యం తాగే వాళ్ళు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మద్యం తీసుకోవడం వలన జీవితం పొడవున ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఎవరైతే మద్యం తీసుకుంటారో వారు క్యాన్సర్ బారిన పడటం ఖాయం. చాలామంది ఖాళీ కడుపుతో మద్యం తీసుకుంటారు.
ఖాళీకడుపుతో మద్యం తీసుకుంటే మత్తు త్వరగా ఎక్కే అవకాశం ఉంటుంది. రాత్రిపూట మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదయం లేవగానే హ్యాంగోవర్ సమస్యతో ఎక్కువగా బాధపడేవారు ఉన్నారు. ఇప్పటికీ మద్యం అలవాటు ఉన్న వాళ్ళు అలాంటి వాటికీ దూరంగా ఉండటం చాలా మంచిది. మహిళల శరీరం పై పురుషుల శరీరాన్ని పోలిస్తే మహిళలపై ఆల్కహాల్ ప్రభావం ఎక్కువగా చూపుతుంది.
కాబట్టి మహిళలు కూడా వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడమే మంచిది. మద్యం ఎక్కువగా సేవించేవారిలో మెదడులో డోపమైన్ అనే మాలిక్యూల్ విడుదలవుతుంది. ఇలా మద్యం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ చాలావరకు నష్టాలే ఉన్నాయని చెప్పవచ్చు. తరచూ మద్యం సేవించే వారిలో శరీరంలో కొన్ని ముఖ్యమైన అవయవాలు తక్కువ సమయంలోనే దెబ్బతినే అవకాశం ఉంది.