పుట్టినప్పటి నుంచి మనం చాలా పాములను చూసి ఉంటాము. నాగు పాము, కట్లపాము, జర్రిపోతు, ఇలా చాలా పాములు వివిధ సందర్భాల్లో మనకు దర్శనం ఇచ్చి ఉంటాయి. వాటిని చూసి మనం భయపడి పారిపోతాం. అయితే వాటిని ఒక సారి నిసితంగా గమనిస్తే అవి ఏ రంగుల్లో ఉండేది అర్థం అవుతుంది. కొన్ని తెల్లగా ఉంటే… మరి కొన్ని నల్లగా ఉంటాయి. ఇంకొన్ని బూడిద రంగులో ఉంటాయి. ఇలా చాలా రంగుల్లో దర్శనం ఇస్తుంటాయి. అయితే అమెరికాలోని ఓ అరుదైన పాము జాతుల్లో ఒకటి అయిన రెయిన్ బో స్నేస్ సుమారు 50 ఏళ్ల తరువాత కనిపించింది.
ఈ అరుదైన పాముకు ఓ ప్రత్యేకత ఉంది. దీనికి పేరుకు తగ్గట్టుగానే ఈ పాము అనేక రంగుల్లో కనిపిస్తుంది. అంటే కేవలం ఒక రంగుకు మాత్రమే పరిమితం గాక తనలో ఉన్న రంగుల్ని చూపిస్తుంది. అందుకే దీనిని రెయిన్ బో పాము అంటారు. దీనిని అమెరికా లోని ఫ్లోరిడా లో గుర్తించారు. ప్రస్తుతం ఇది చూపరులకు కనువిందు చేస్తుంది. దీని పొడవు సుమారు నాలుగు అడుగులు ఉంటుందని ఫ్లోరిడా ఫిష్, వైల్డ్ లైఫ్ పరిశోధకులు చెప్తున్నారు.
ఇటీవల ట్రెసీ కాతేస్ అనే వ్యక్తి ఒకాలా అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ పామును చూసినట్లు పరిశోధకులు చెప్తున్నారు. తాను చూసిన చాలా పాముల్లోకి ఆ పాము చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పాడు. అందుకే వెంటనే తన దగ్గర ఉన్న కెమెరాతో ఫోటోలు తీశాను అని పేర్కొన్నాడు. పరిశోధకులు చెప్తున్న దాని ప్రకారం ఈ రెయిన్ బో స్నేక్ 50 ఏళ్ల కిందట కనిపించిట్లు చెప్పారు. మరలా ఇప్పుడు కనిపించింది పేర్కొన్నారు. గమత్తు ఏంటి అంటే ఈ పాముకు విషం ఉండదు.