జగన్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు 2,112 జరిగాయని, ప్రభుత్వంచెబుతున్న లెక్కమాత్రం 718 మంది అని విమర్శించారు. సురాజ్యవేదిక, మానవహక్కుల వేదిక రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే రైతుల దుస్థితిని, సాగు దీనస్థితిని కళ్లకుకట్టిందని పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రైతు భరోసా కింద రూ.7500లెక్కన 50 లక్షల మంది రైతులకు మూడేళ్లలో ఇచ్చింది రూ.11,250కోట్లు మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న రూ.లక్షా10వేలకోట్లు ఎక్కడ, ఎవరికి ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక ఈ ప్రభుత్వంలో మూడేళ్లలో నష్టపోయింది రూ.25 వేల కోట్లని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రైతులను ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెబుతున్నాడని, కానీ పొరుగు రాష్ట్రంతో పోలిస్తే చేస్తున్నది శూన్యమని విమర్శించారు. రైతులకు కరెంట్ ఉచితంగా ఈ ప్రభుత్వమే కొత్తగా ఇస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, రైతు భరోసా పేరుతో జగన్ ఒక్కో రైతుకుటుంబానికి రూ.7,500ఇస్తుంటే, కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. జగన్ ఏలుబడిలో ప్రతి ఎకరాకు సరాసరిన రూ.10వేలచొప్పున రూ.16,500కోట్ల పెట్టుబడి పెరిగిందని తెలిపారు.
ఈ ప్రభుత్వంలో ఒక్కధాన్యం రైతే పెట్టుబడి పెరిగి, మద్ధతు ధర పొందలేక రూ.40వేల కోట్లవరకు నష్టపోయాడన్నారు. శ్రీకాకుళంనుంచి అనంతపురం వరకు 75కేజీలధాన్యం బస్తా అమ్మిన వారిలో ఎంతమందికి రూ.1460మద్ధతుధర అందిందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో 1, 2శాతం వైసీపీ నేతలకు తప్ప ఏ రైతుకీ గిట్టుబాటు ధర ప్రకారం న్యాయం జరిగిందో, ఎందరు రైతులకు ధాన్యం బకాయిలు సక్రమంగా ఇచ్చారోచెప్పాలన్నారు. ధాన్యం అమ్ముకున్న వారానికి డబ్బులిస్తామన్నారు.. 3, 4నెలలకు కూడా రైతులకు బకాయిలు అందడంలేదని ఆరోపించారు. రైతులకు అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ రూ.3 వేల కోట్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు.