Site icon 123Nellore

అధిక ఎక్సర్ సైజ్ చేయడం వల్ల వచ్చే సమస్యలు..!

బాగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, బాడీ షేమింగ్ తగ్గించుకోవాలనుకునే వారు ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. మందులతో పోని రోగాలు కూడా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల తగ్గుముఖం పడతాయి. ఇది కూడా డైలీ ఎక్సర్ సైజ్ చేయాలని అసలు పెట్టుకోనేవద్దు. ఒకవేళ ప్రతిరోజూ చేసినా ఓ పరిధి మేరకు, పరిమితంగా చేయాలి. ఇటీవల చినపోయిన సినీహీరో పాయల్ రాజ్ పుత్, మంత్రి గౌతమ్ రెడ్డి కూడా అధిక ఎక్సర్ సైజ్ చేయడం వల్ల చనిపోయారనే రూమర్లు బాగానే వచ్చాయి. అయితే నిర్ణీత సమయంలో, తగ్గట్టుగా చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

కండరాలు బలంగా ఉండేందుకు ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుంది. అధికంగా చేసేటప్పుడు మధ్యమధ్యలో కొంచం విరామం తీసుకుంటే మంచింది. అధికంగా చేసినా వారాంతం చివరి రోజున కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. అలా చేయని పక్షంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇష్టానుసారంగా చేస్తే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అధికంగాచేయడం వల్ల ఆకలి తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు  ఎక్కువగా డిప్రెషన్ క లోనవడం, తలనొప్పి రావడం,  ఒత్తిడికి గురవటం వంటివి సంభవిస్తాయి.

అంతేకాదు నిద్రలేమి సమస్య, శక్తి కోల్పోవడం, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, పనితీరు తగ్గటం వంటివి మనిషిలో కనిపిస్తాయి. అధిక ఎక్సర్ సైజ్ చేయడం వల్ల సంభవించే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కనీసం వారాంతంలోనైనా ఒకసారి ఎక్సర్ సైజ్ కు దూరంగా ఉండాలి. అది వీలు కాకపోతే కొంత సమయానికి పరిమితం చేసుకోవాలి. తీసుకోవాల్సిన తిండిలో కూడా సరైంది తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Exit mobile version