Site icon 123Nellore

జగనూ..నీకో దండమని అంటున్నారు ప్రజలు : వంగలపూడి అనిత

గతంలో బాదుడే బాదుడు అని చెప్పి ఇప్పుడు జగను బాదుతున్నాడని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. పింఛన్ డబ్బులు తీసుకొని ప్రేయసితో జంప్ అయిపోయినందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం పెట్టడం భేష్ అని ఎద్దేవా చేశారు. వాలంటీర్లే ఇళ్లల్లో నాటుసారా కాస్తున్నారని, ఇండ్లల్లోకి వెళ్లి అఘాయిత్యాలు చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి కార్యక్రమలు చేస్తున్నందుకా వాలంటీర్లను సన్మానం చేసిందని ప్రశ్నించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ప్రజా ధనం రూ.250 కోట్లు కన్నం వేశారని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి, వృద్ధులకు పెంఛన్లు ఇవ్వడానికి, పీఆర్సీ ఇవ్వండని అడిగితే అందుకు డబ్బులు లేవని, వైసీపీ కార్యాలయాలకు రంగులు వేయడానికి రూ.3 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయన్నారు.

ఫ్యానుకు ఓటేసిన పాపానికి ఫ్యాన్ తిరగకుండా చేస్తున్నారుని, రావాలి జగన్.. కావాలి జగన్ అని పాడినవారు ఇండ్లల్లో వారి ఆడవాళ్లు తంతున్నారన్నారు. రోజు రోజుకి జగన్ లో సైకోయిజం పెరిగిపోతోందని, ప్రజల కష్టాలు తనవి కావు అన్నట్లుగా వ్యవహరించడం జగన్ కే సాధ్యమని విమర్శించారు. దిక్కుమాలిన సంక్షేమ కార్యక్రమాలకు సాక్షి పత్రికలో యాడ్ కు వెయ్యి కోట్లు ప్రజా ధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.  జగన్ పాదయాత్ర సమయంలో సేవ చేసినవారికి సలహాదారు పోస్టులివ్వడం దారుణమన్నారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా పన్నులు విధించినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు.

ఢిల్లీ వెళ్లి రాష్ట్ర పరిస్థితుల గురించి, రాష్ట్రానికి కంపెనీలు రావాలి అని చెప్పక.. బేల కబుర్లు, బేల ఏడుపులు, డొల్ల పనులా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళల రూ.2వేల కోట్లు అతని అకౌంట్లలో వేసుకోవడం దారుణమన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను రోజు రోజుకు మానసిక క్షోభని పెంచుతున్నాడు మండిపడ్డారు. ఒక సైకో ఆనందాన్ని పొందుతున్న ప్రిజినరీ వ్యక్తి జగన్ రెడ్డి అని,  సైకో సీఎం, సైకో జగన్ రెడ్డి అన్నా అతిశయోక్తిలేదన్నారు. కరెంటు చార్జీల మోత, పెట్రోల్, డీజిల్ ధరల మోత మరోవైపు నిత్యవసర వస్తువుల ధరల మోత మోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Exit mobile version