Drink Water: మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ఈ క్రమంలో తిన్న తర్వాత మనకు ఒక గ్లాసు నీళ్ళు తాగాలనిపిస్తుంది. మనలో చాలా మంది డైలీ చేసే పని ఇదే. కానీ ఇలా చేయడం కొంత వరకు సంతృప్తిని ఇచ్చినప్పటికీ కొంత వరకు ప్రమాదం అని తెలుస్తుంది. అలా కొన్ని సమయాలలో నీళ్లు తాగడం మంచిది కాదని తెలియటంతో.. ఇంతకు అది ఏ సమయంలోనూ తెలుసుకుందాం.
పండ్లు: పండ్లు ఆహారంగా తీసుకున్నప్పుడు నీళ్లు అసలు తాగకూడదు. ఎందుకంటే పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈస్ట్ స్థాయి కూడా విరివిగా వుంటుంది. అలా పండ్లు తిన్న క్రమంలో సమయంలో కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఈ సమయంలో పండ్లు తిని వెంటనే నీళ్లు తాగితే ఆ పండ్లు సరిగ్గా జీర్ణం కాకుండా మొదలైన సమస్యలకు దారితీస్తాయి.
సహజ ఆహారాలు: నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు అసలు తినకూడదు. అనగా దోసకాయ, నారింజ కాయ, పుచ్చకాయ వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇక వీటిని తిన్న తర్వాత నీళ్ళు తాగితే చాలా వరకు మీ శరీరంలో డయేరియా పెరిగే అవకాశం ఉంది.
వేరుశెనగలు: వేరుశెనగలు తిన్న తర్వాత నీళ్ళు తాగడం మంచిది కాదని తెలుస్తుంది. ఇలా తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల దగ్గు సమస్య మరింత పెరిగే అవకాశం ఉందట. అంతే కాకుండా ఐస్ క్రీం, చెరుకు గడలు వంటివి తిన్న తర్వాత కూడా నీళ్లు తాగడం మంచిది కాదని తెలుస్తుంది.