టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈయన సినిమాల్లో నటించాలని ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు.
ఒకప్పుడు నదియా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమెకు చిరంజీవి సరసన నటించే అవకాశం వచ్చింది.1990 లో కే మురళి మోహన్ రావు దర్శకత్వంలో కొదమసింహం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నటించగా ఆయన సరసన రాధ, వాణి విశ్వనాథ్, సోనం నటించారు. నిజానికి సోనం ప్లేస్ లో ముందుగా నదియాకు అవకాశం వచ్చింది.
కానీ తనకు డేట్స్ చిరంజీవి డేట్ లకు కుదరకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. అలా అప్పట్లో చిరంజీవి సరసన అవకాశాన్ని మిస్ చేసుకుంది నదియా. ఇక ప్రస్తుతం రీ ఎంట్రీ తో మంచి మంచి పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.