Site icon 123Nellore

కచ్చా బాదమ్​ పాటకు నేపాలీ చిన్నారి స్టెప్పులు… సోషల్​ మీడియాలో వైరల్​!

ఓ స్ట్రీట్ సింగర్​ పాడిన కచ్చా బాదం అనే పాటు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. నిజం చెప్పాలి అంటే సామాజిక మాధ్యమాలు ఉపయోగించే వారికి ఈ పాట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతేగాకుండా ప్రస్తుతం ఉన్న వాటిలో ఇది ట్రెంటింగ్ పాట. దీనిని పశ్చిమ్ బెంగాల్​కు చెందిన ఓ స్ట్రీట్ సింగర్ వేరు శెనగలు అమ్ముకునేందుకు దీనిని పాడాడు. అప్పటి నుంచి ఇది ఓ రేంజ్​ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దేశంలోని అనేక మంది స్టార్లు కూడా ఈ పాటుకు ఇన్ స్టాగ్రామ్​ లో రీల్సు చేస్తున్నారు.

Little Girl Dances to Viral Kacha Badam Song

ఇప్పటికే ఈ పాటకు సోషల్​ మీడియాలో సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రెటీలు కూడా ఓ రేంజ్​ లో రీల్సు చేస్తున్నారు. అంతేగాకుండా ఈ పాట పాడిన వ్యక్తి భూబన్ బద్యాకర్​ సోషల్ మీడియాలో ఫేమస్​ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ పాట కేవలం మన దేశంలోనే కాదు… పక్క దేశాల్లో కూడా దుమ్మురేపుతుంది.

ఇటీవల ఈ పాటకు ఓ చిన్నారి డ్యాన్స్​ చేసింది. ఈ వీడియో ఇప్పుడ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ డ్యాన్​ వేసిన అమ్మాయి భారత్​ కు చెందిన అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఈ కచ్చా బాదామ్​ పాటకు నృత్యం చేసిన అమ్మాయి ఓ నేపాలీ. చిన్న పిల్ల. ఈ చిన్నారి వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ రేంజ్​ లో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్​ గా మారింది.

Exit mobile version