New Phone: మనదేశంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ లు లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయని చెప్పవచ్చు. అందుకని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా పిల్లలకు మాత్రం ఆన్లైన్ అని క్లాసెస్ అని వాడుక బాగా ఎక్కువ అయ్యింది. దీంతో చాలామంది ఈ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
మరీ మీరు కూడా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా. అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్ యొక్క ఆన్ లైన్ ప్రైజ్, అఫ్ లైన్ ప్రైజ్ రెండిటి మధ్య తేడా చూసుకోవాలి. ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేయడం మేలు. అసలు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ గురించి తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
మీకు అవసరమైన ఫీచర్లు ఉన్న ఫోన్ లు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ముఖ్యంగా ఫోన్ కొనుగోలు చేసే టైం లో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయా లేవా అనే సంగతి తెలుసుకోవాలి. సెక్యూరిటీ ఫీచర్లు లేని ఫోన్ మీరు కొనుగోలు చేస్తే మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు. గేమింగ్ ఫోన్ లు కొనుగోలు చేయడం అనేది అది మీ సమయం వృధా చేయడానికి అని చెప్పవచ్చు.
చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ కి అలవాటు పడుతున్నారు. దీంతో వాళ్లు చదువు మీద దృష్టి దృష్టి పెట్టలేకపోతున్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా గేమింగ్ లకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి గేమింగ్ ఫోన్ లకు వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది.