Eye problem: ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అంటారు పెద్దలు. మనం కళ్ళు లేకుండా ఎలాంటి పనులు చేయలేము. కానీ మనం అలాంటి కంటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. సాధారణంగా మనుషులు చర్మ సౌందర్యం పట్ల ఎన్నో జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా చర్మ రక్షణకు పెట్టే జాగ్రత్తలో 5 శాతం కూడా మనం కంటిపై చూపము. ఇదివరకు వయసు ముదిరిన వారిలో కంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి.
కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న మనుషుల జీవన జీవన విధానం కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చిన కంప్యూటర్లు, లాప్ టాప్ లో మునిగిపోవడం వలన, అదే లాప్ టాప్స్ లో స్మార్ట్ వర్క్ అలవాటుపడడం వలన కంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ కూడా కంటి సమస్యలకు అతిపెద్ద కారణం అని చెప్పవచ్చు. కంటి చూపును మెరుగు పరుచుకోవడానికి మనం తినే ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలను జోడించడం ద్వారా కంటిచూపును మెరుగు పెట్టొచ్చని తెలుస్తుంది. అదేమిటంటే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి చూపు పరచడానికి చాలా బాగా పనిచేస్తాయి. కావున షుగర్ తో బాధపడేవారు. షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకుంటే మంచిది.
మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా స్ట్రాబెర్రీలు, చిలకడ దుంపలు, క్యారెట్లు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కంటి చూపును చాలావరకు మెరుగుపరచుకోవచ్చు.