Cancer: ఈ మధ్య కాలంలో క్యాన్సర్ తరచూ ప్రతి పదిమందిలో ఐదుగురికి వస్తుంది. ఈ క్యాన్సర్ అనేక రకాల లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఇక క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా ఏర్పడుతుంది. కొన్ని రకాల లక్షణాలు ఉంటే మహిళలకు క్యాన్సర్ వ్యాధికి దారి తీస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్.. మహిళల్లో అత్యంత సులువుగా ఏర్పడే క్యాన్సర్. ఇక రొమ్ము భాగంలో అర్ధాంతరంగా మార్పులు సంభవించినప్పుడు అవి రొమ్ముక్యాన్సర్ కి కారకాలు అని చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో లేట్ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇక అంతే కాకుండా రొమ్ము భాగంలో లేక చంకలో నొప్పి తెలియని గడ్డలు ఏర్పడతాయి. రొమ్ము పై కూడా కొన్ని రకాల మార్పులు వస్తాయి. ఇక వారం కంటే ఎక్కువ రక్తస్రావం జరగడం. ఇలా తరచూ రక్త స్రావ సమస్యలు ఏర్పడితే వెంటనే నిపుణులను సంప్రదించాలి.
ఇందులో మరొకటి ఏమిటంటే లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం జరగడం. అంతేకాకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా రక్తం స్రవిస్తే ఇది కచ్చితంగా గర్భాశయ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు వైద్యులను సంప్రదించడం మంచిది.
ఇక ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ జరగక ఉన్నపుడు ఆ తర్వాత రక్త స్రావం జరిగినట్లయితే ఇది గర్భాశయ క్యాన్సర్ కు దారితీస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ లక్షణాలను మీరు వెంటనే గుర్తించి వైద్యుని సమక్షంలో పరీక్షలు చేయించుకోవడం మంచిది.