Site icon 123Nellore

ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్య గ్యారంటీ!

Chanakya Niti: మన పూర్వీకులు చాలామంది అనేక అశుభాలను సూచిస్తూ ఉంటారు. ఇందులో నల్ల పిల్లి ఎదురు వస్తే చెడు జరుగుతుందని.. దేవుడు కోసం పెట్టిన దీపం హఠాత్తుగా ఆరిపోతే అదొక చెడు సూచికమని భావిస్తుంటారు. ఇలా ఒక్కో సంకేతాన్నీ ఒక్కో విధంగా ఊహించుకుంటారు.

Chanakya Niti

ఈ సంకేతాలు అన్నీ అప్పటి కాలం నుంచే వస్తున్నాయి. వీటిని కొంతమంది నమ్ముతారు. మరికొందరు నమ్మరు. ఇదంతా పక్కన పెడితే కుటుంబ రాబోయే ఆర్థిక సమస్యలు కనిపెట్టేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఆచార్య చాణక్యుడు కొన్ని గ్రంధాల ద్వారా తెలిపాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువగా పూజలు చేసేవారు ఇంట్లో తులసి చెట్టు పెంచడానికి ఇష్టపడతారు. ఈ తులసి చెట్టు కొన్నిసార్లు ఆకస్మికంగా ఎండిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఒకవేళ ఎండిపోతే దానిపై మనం వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఎటువంటి కారణాలు లేకుండా ఇంట్లో అద్దం పగిలి పోతే దానిని ఆర్థిక సమస్య సంకేతంగా సూచిస్తారు.

కావున పగిలిపోయిన అద్దాన్ని, పలు గాజులను ఇంటిలో అసలు ఉంచకండి. వెంటనే వాటిని దూరంగా పడేయడం మంచిది. ఇంట్లో ఎక్కువ గొడవలు పడకూడదు. ఎప్పుడూ కోపం తో ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండడానికి ఇష్టపడదు. అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్య ఎక్కువగా ఎదురవుతుంది.

పెద్దలను అవమానించే ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉండదు. పూజ చేయని ఇంటిలో దేవుడు కొలువై ఉండడు. పేదరికం ఎప్పుడూ ఆ ఇంటిని అంటుకూనే ఉంటుంది.

Exit mobile version