నిత్యం అనేక టెన్షన్లు, పని ఒత్తిడితో అనేక మంది తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు పడతారు. తలనొప్పి దాటికి విచక్షణ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పైకి కనిపించని నరకాన్ని తలనొప్పి ద్వారా చూస్తాం. అయితే ఈ తలనొప్పి నుండి తప్పించుకోలేక అనేక మంది నిత్యం పెయిన్ కిల్లర్ వాడతారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెప్పినా వినడం లేదు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఎక్కువ. తలనొప్పి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ఫ్రెష్ ద్రాక్షా పళ్లను తీసుకుని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా అల్లం ఉపయోగపడుతుంది. తల నొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా మఠుమాయం చేస్తుంది.
ఎలా అంటే దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదిటిపై రాసుకొని 30 నిమాషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం పై చిట్కాలు పాటించి తలనొప్పిన దూరం చేసుకోండి.