Site icon 123Nellore

నేను హీరోయిన్..రేవంత్ రెడ్డి విలన్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం రేగుతోంది. పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలవుతోంది. మొన్నటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిని వెలక్కగక్కారు. ఇది సమసిపోయిందనకున్న సమయంలోనే తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ జగ్గారెడ్డి(జగ్గారెడ్డి) బహిరంగంగా తన అసంతృప్తిని మీడియా ముందు వెల్లడించారు. ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన పరిస్థితిలా తన పరిస్థితి తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి విలన్ అయితే..తాను హీరోయిన్ అని తెలిపారు.  టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండించారు.

కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్‌ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదన్నందునే  మౌనంగా ఉన్నాన్ననారు. తన పంచాయితీ రేవంత్‌తో కాంగ్రెస్‌తోనే అని, కాంగ్రెస్ తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించారు.?. 20 రోజుల క్రితం రేవంత్‌ ఫోన్‌ చేశారని, మెదక్‌ సీఎస్‌ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు.  పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సోమవారం కీలక ప్రకటన చేసింది.

పార్టీకి సంబంధించి ఆయన నిర్వర్తించే బాధ్యతలను మిగిలిన ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం తనతో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడటం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు.  మరోపక్క, ఢిల్లీకి రావాలని తనకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని తెలిపారు.

Exit mobile version