టెక్నాలజీని ఉపయోగించుకుని మెడికల్ పరీక్షలు ఈజీగా పాస్ అవుదాం అని అనుకున్నారు ఓ ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు. పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని ఎవరికీ డౌట్ రాకుండా పని కానిచ్చేద్దాం అని భావించారు. ఇలా భావించిన ఆ ఇద్దరు విద్యార్థులు చివరకు చక్కెదురయ్యింది. వారు ఉపయోగించిన సాంకేతికతను చూసిన ఇన్విజిలేటర్, ఫ్లయింగ్ స్కాడ్ లు ఔరా ని అన్నారు. నిజానికి వారు కనిపెట్టలేకపోయేవారని కానీ ఓ చిన్న సిగ్నల్ కారణంగా అసలు విషయం బయటపడినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటైం లో స్లిప్పులు పెట్టి కాపీ కొట్టి ఉంటారు. కొందరు సార్ లకు దొరుకుతారు. అదృష్టం లేని వారు పట్టుబడి పోతారు. కానీ కాపీ కొట్టడం అయితే పక్కా… కానీ తరాలు మారుతున్న కొద్దీ కాపీ కొట్టే పద్దతుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఏకంగా క్వషిన్ పేపర్ లోని ప్రశ్నలను చూసుకుని వచ్చి పరీక్ష రాసే వారు. కొంత మంది అయితే ఏకంగా దానిని తీసుకుని వచ్చి ఆన్సర్ షీట్ కింద పెట్టుకుని రాసే వారు… అయితే ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ సాయంతో ఏకంగా అర్జున్ సినిమాలో లాగా హైటెక్ కాపింగ్ కు పాల్పడుతున్నారు. ఓ బ్లూటూత్‌ను చెవిలో ముందుగానే ఫిట్ చేయించుకోవడం కోసంగా ఏకంగా సర్జరీ చేయించుకున్నాడు ఓ మహానుభావుడు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిర్వహించిన ఓ మెడికల్ పరీక్షకు అటెండ్ అయిన ఓ స్టూడెంట్.. బ్లూటూత్ సాయంతో కాపీ కొట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అదే చివరి అటెంప్ట్. దీంతో ఎలా అయిన పాస్ అవ్వాలని అనుకొని చెవిలో బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాయడానికి ప్రత్నించారు. వచ్చి స్కాడ్ చేసిన తనిఖీల్లో ఇట్టే దొరికిపోయాడు. ముందుగా ఆ వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ ఉందని గుర్తించిన అధికారులు.. అనంతరం అందులో బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉండడం చూసి ఆరా తీశారు. అప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. చెవిలో సర్జరీ చేయించుకుని అమర్చుకున్నట్లు తెలిపారు. అది చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.