సాధారణంగా చాలామంది జుట్టు రాలడం చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే వివిధ రకాలైన షాంపూలను ఉపయోగించడం వల్లన ఆ సమస్యను కొంత కాలం వరకు చెక్ పెట్టవచ్చు. అయితే కొంతకాలం తర్వాత జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు మళ్లీ ఏర్పడటం సర్వసాధారణమే. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు సర్వరోగ నివారిణి వేపాకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చుండ్రుకు వేప ఆకు మంచి మెడిసిన్ అనే చెప్పాలి. వేపలో ఉండే ఔషధ గుణాల ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వేప వల్ల జుట్టు, చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే.వేప ఆకును సరిగ్గా ఉపయోగిస్తే.. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే తెలుసుకోండి మరి ఈ చిట్కాలను మీ కోసమే…
వేప ఆకులను పేస్ట్ ను పెరుగులో కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యకి మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు, దురద, మొటిమలు వంటి సమస్యలు మంచి ఉపశమనం లభిస్తుంన విషయం తెలిసిందే. వేప ఆకులను కొబ్బరినూనెలో వేసి మరిగించి చల్లార్చి జుట్టుకు పట్టించాలి. ఈ నూనె ద్వారా చుండ్రుకు స్వస్తి చెప్పవచ్చు. అలానే వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా మారిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్యలు పోవడం సహా జుట్టులోని ఇతర సమస్యలు దూరమవుతాయి.