Site icon 123Nellore

ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ఎన్ని అనర్ధాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు???

health-tips-to-cure-that-problems-with-the-help-of-salt

మారుతున్న జీవన శైలి లో చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలతో చాలా మంది పోరాడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది గుండెపోటు. చిన్న వయసులోనే గుండెపోటుతో చాలా మంది మరణిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు సరైన మోతాదులో లేకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే అధిక బరువు కూడా గుండె సమస్య ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి సమస్యలకు కు వ్యాయామాలు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను ఉపశమనం పొందవచ్చు. అయితే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం మంచిదని తెలుపుతున్నారు అవేంటో తెలుసుకుందామా..

గుండెపోటు సమస్యతో బాధపడేవారు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం మంచిది. తాము తీసుకునే ఆహారంలో పాలు గుడ్డు పండ్లు కూరగాయలను అధికంగా ఉండేలా చూసుకోవాలి. మైక్రోఓవెన్ లో వేడి చేసిన పదార్థాలను తీసుకోకపోవడం గుండెపోటు మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకోకూడదు మరియు నూనె వాడకాన్ని తగ్గించడం వలన అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడవచ్చు. గుండ సంస్కృత బాధపడేవారు గుండ సమస్యతో బాధపడేవారు పచ్చి కూరగాయలు మరియు పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అలానే ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించడం మంచిది. అధికంగా ఉప్పు ఉపయోగించడం వలన కీళ్ల సమస్యలు మరియు గుండె సమస్యలు అధికమవుతాయి. ఉప్పులో ఉండే సోడియం హైపర్ టెన్షన్ ప్రేరేపిస్తుంది ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల గుండెపోటు వంటి సమస్యలు అధికమవుతున్నాయి.ఉప్పును మితంగా వాడటం ద్వారా ఆరోగ్యమైన జీవితాని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version