ప్రస్తుత కాలంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన అనారోగ్య సమస్య గ్యాస్ట్రబుల్. ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా ఎక్కువ మంది ఈ గ్యాస్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారు ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఎన్నో మెడిసిన్స్ ను, వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ సమస్య నుంచి కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా …
వీటిని దూరం పెట్టండి :
గ్యాస్ సమస్యతో బాధపడేవారు కాలీఫ్లవర్, బీట్ రూట్స్, సోయాబీన్స్, ఉల్లి, వెల్లుల్లి, ప్రోటీన్స్ లో బీన్స్ కు దూరంగా ఉండాలి.
అలాగే పియర్, పాస్తా, ప్రూన్, పాస్తా, చెర్రీస్ ను అస్సలు తినకూడదు. వీటిని తింటే గ్యాస్ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
వీటిని ఫాలో అవ్వండి :
గ్యాస్ సమస్యను తగ్గించడంలో గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, వరి అన్నం బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
నేరేడు, బత్తాయి, నారింజ, అరటి, కివీ, ద్రాక్ష, పైనాపిల్, స్ట్రాబెర్రీ, నిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
దోసకాయ, టొమాటో, క్యారెట్, మిరియాలు, ఆలుగడ్డ, అల్లం, లెట్యూస్, పాలకూర వంటి వాటితో ఈ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది.
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో మాంసాహారం కూడా బాగా పనిచేస్తుంది. ఫిష్, చికెన్ మంచి మేలు చేస్తాయి, కానీ మసాలాలు తగ్గించి తీసుకోవాలి.
అలాగే నీళ్లను వీలైనంత ఎక్కువగా తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.