Site icon 123Nellore

చలికాలంలో పెదవులు పొడిబారుతున్నాయా? అయితే ఈ చిట్కాలు మీకోసమే

చలికాలం అంటే అందరికీ కాస్త భయంగానే ఉంటుంది. ఎందుకంటే అధిక చలి చర్మం పగలటం వంటి సమస్యలు అధికం అవుతాయి. దీంతో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెదవులు ‌శీతాకాలంలో , పగలడం అలానే పెదవుల నుంచి కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. చూడ్డానికి కాస్త ఇబ్బంది గా కనిపిస్తూ ఉంటారు. పొడిబారిన పెదవులు కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాలైన క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

పెదవులు చాలా సున్నితమైన చర్మం కలిగి ఉంటాయి. చలికాలంలో పెదవులు తేమ గుణాన్ని త్వరగా కోల్పోతాయి.
అందమైన పెదవుల కోసం మనం ఇంట్లో ఉంటూనే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అందమైన పెదవులను మీ సొంతం చేసుకోవచ్చు. పెదవులు కొబ్బరి నూనెను చక్కగా పనిచేస్తుంది ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పెదాలను సూక్ష్మక్రిములు లేకుండా ఉంచడంలో సహాయపడతాయి.అలానే పొడిబారకుండా అందమైన పెదవులు మీ సొంతం చేసుకోవచ్చు.

వెన్నతో కూడా గులాబీ రంగు వంటి పెదవులు మీ సొంతం చేసుకోవచ్చు. రోజు కాస్త వెన్న తీసుకొని పెదవుల మీద మర్దన చేసుకుంటే పెదవులు పగలటం వంటి సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు.అలానే కాస్త పుదీనా కొత్తిమీర తీసుకుని మెత్తగా మిశ్రమం చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని పెదవులపై మర్దన చేస్తే పెదవులు పొడిబారడం మరియు పగుళ్లు వంటి సమస్యల పరిష్కరించుకోవచ్చు. అలాగే అధికంగా నీరు తాగడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

Exit mobile version