ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన అనర్గ్యం కారణగా ఎక్కువ మంది చనిపోతూ ఉండడం మనం గమనించవచ్చు. శారీరికంగా బలంగా ఉండే వారు కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్న వార్తలను మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. గుండెకి సంబంధించిన సమస్యల్లో అధిక రక్తపోటు, అల్ప రక్తపోటు అనేవి ఉన్నాయి. తక్కువ రక్తపోటునే హైపోటెన్షన్ అని కూడా అంటారు. సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. దీన్ని సాధారణంగా లో బీపీ అని అంటూ ఉంటాం. ఆరోగ్యవంతులకు సాధారణ రక్తపోటు 120/180మధ్య ఉంటుంది. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే, మీరు తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారని అర్దం చేసుకోవచ్చు.
తక్కువ రక్తపోటు ఉన్నవారిలో అస్పష్టమైన దృష్టి, గందరగోళం, నిరాశ, చలి, దాహం, శ్వాస నెమ్మదిగా తీసుకోవటం, మూర్చ, తేలికపాటి తలనొప్పి, గాయం తగిలిన సందర్భంలో ఎక్కువగా రక్తస్రావం జరగటం వంటి లక్షణాలను గమనించవచ్చు. ఇది తీవ్రమైన సమస్య అయినప్పటికి దాని నుండి బయటపడటం కష్టమేమి కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మనం తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చని చెబుతున్నారు. ఆ హెల్త్ టిప్స్ మీకోసం ప్రత్యేకంగా…
- నీరు లేకపోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ తగ్గి రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల, రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగాలి.
- లో బీపి సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి.
- ఆహారం మొత్తం ఒకేసారి తినకుండా, తక్కువ మొత్తంలో విడతల వారీగా తింటూ ఉండాలి.
- ఎక్కువ ఉప్పు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది.
- కొన్ని సార్లు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, తక్కువ రక్తపోటు సమస్య వస్తుంది. అందుకు వైద్యుల సహాయం పొందటం ఉత్తమం.