Site icon 123Nellore

రెగ్యులర్ గా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా … అయితే తస్మాత్ జాగ్రత్త !

కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో కూడా మార్పు సహజంగా వస్తుంది. ఒకప్పుడు తెల్ల జుట్టు అంటే ముసలితనం వచ్చాక కనిపించేది. కానీ ఇప్పుడు వాతావరణం మార్పు, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా యువకులకు కూడా తెల్లజుట్టు వచ్చేస్తుంది. ఈ కారణంగా చాలా మంది జుట్టుకు కలర్ వేసుకోవడం మనం గమనించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడ, మగ అని తేడా లేకుండా హెయిర్ డైను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా హెయిర్ డైలో అమ్మోనియా, హెయిర్ ఫార్మాల్డిహైడ్, బి-ఫినైల్నెడిమిన్, బొగ్గు తారు, రెసోర్సినాల్, యూజీనాల్ లను ఉపయోగిస్తారు. వీటితో క్యాన్సర్‌తో సహా పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని సూచిస్తున్నారు. 35% కంటే ఎక్కువ మంది మహిళలు, 20% కంటే ఎక్కువ మంది పురుషులు జుట్టుకు కలర్ వేస్తున్నారని తాజాగా విడుదలైన నివేదికలో తేలింది. అయితే హెయిర్ డైలో ఉపయోగించే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…

క్యాన్సర్ : ఫార్మాల్డిహైడ్, బొగ్గు , సీసం అసిటేట్ మరియు ఇతర హానికరమైన రసాయనాలు మూత్రాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతాయి.

అలెర్జీ : హెయిర్ డైలోని బి-ఫెనిలెనెడిమిన్ అనే రసాయనాన్ని చర్మంలోకి శోషించడం వల్ల అలర్జీ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాంటాక్ట్ డెర్మటైటిస్‌లో ఒక అధ్యయనం ప్రకారం, హెయిర్ డైల వాడకం అలెర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

మూత్రపిండాల సమస్య : హ్హెయిర్ డై లో వాడే బి-ఫెనిలెనెడిమైన్ వల్ల మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. తాజా అధ్యయనం ప్రకారం నెలకు ఒకసారి హెయిర్ డైని ఉపయోగించే వ్యక్తులకు మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. నలుపు, గోధుమ వంటి ముదురు రంగులను ఉపయోగించినప్పుడు ఈ ప్రమాదం మరి ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

శ్వాసకోశ సమస్యలు : ఈ జుట్టు రంగులలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనానికి అమ్మోనియా కలుపుతారు. ఈ రసాయనాల వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

Exit mobile version