నిత్యం వంటల్లో ఉపయోగించే వాటిల్లో అల్లం కూడా ఒకటి. నాన్ వెజ్ వంటకాల్లో, బిర్యానీ, చాయ్, చట్నీ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మీకు కానీ అల్లం స్మెల్ ఇష్టమైతే అల్లాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. అయితే కొంతమంది అల్లం పైన తొక్క ఉంచి వాడతారు కొంత మంది తీసేసి వాడతారు. అయితే అల్లాన్ని పీలర్ తోనో, చాకుతోనో తొక్క తీయడం కాకుండా స్పూన్ వెనక భాగంతో తొక్క తీస్తే మంచిదట ఇదంతా తొక్క తీసి వాడేవారికి మాత్రమే. తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి వాడే వారు హ్యాపీగా అలా చేసేసుకోవచ్చు. సాధారణంగా అల్లాన్ని తొక్క తీసి వంటల్లో వండుకుంటే రుచి బాగుంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఎక్కువ సమయం అల్లం గాలికి తగిలితే ఆక్సిడైజ్ అయ్యి అందులో ఉన్న బెనిఫిట్స్ కొన్ని పోతాయి.
అల్లం యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి మరి. అల్లం వేడినీటితో తీసుకోవడం వల్ల గొంతు గరగరని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కలవారు ఉదయాన్నే వేడి నీటిలో అల్లాన్ని, పొదీనా కలిపి తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ని కరిగిస్తుంది. అల్లం బద్ధకం కూడా పోగొడుతుంది. అలానే గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు అల్లం తీసుకోవడం వల్ల అరుగుదలను మెరుగుపరిచే ఉంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేలా అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్న వారు తీసుకోకూడదు. అలాగే, పిత్త దోషం ఉన్న వారు కూడా తీసుకోకూడదు. ఈ సమాచారం కేవలం అల్లం యొక్క సుగుణాలను తెలుపుటకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న వెంటనే నిపుణులను సంప్రదించండి.