ఈ సృష్టిలో అనేక రోగాలు సంగీతంతో తగ్గిపోతాయి. ఇది పూర్వ కాలం నుంచి వింటున్న మాటే. ఇందుకు తగినట్లుగానే చాలా సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చూపించారు చాలా మంది డైరెక్టర్లు. ఇంకా చెప్పాలి అంటే మన మనసు సరిగ్గాలేదు అని భావించినప్పుడు చాలా మంది ఏకాంతంలోకి వెళ్లి మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఇలా చేయడం వల్ల మనిషికి ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి సాంత్వన కేవలం మనుషులు మాత్రమే కాదు.. పశుపక్షాదులు కూడా స్పందిస్తాయి. అయితే ఇప్పుడు మీర తెలుసుకోబోయేది కూడా అటువంటిదే. ఓ వ్యక్తి వాయిస్తున్న మ్యూజిక్ కు ఆకర్షితురాలు అయిన ఓ నక్క మురిసి పోయింది. సంగీతం పై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్త పరిచింది. అయితే దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కొన్ని యాప్ లు వచ్చిన తరువాత సామాన్యులు ఎంత ఫేమస్ అయ్యారో.. అలానే కొన్ని జంతువులు, పక్షులు, స్థలాలు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. వీటికి కారణం సంబంధిత సోషల్ మీడియో యాప్స్ మాత్రమే అని చెప్పాలి. ఇలాంటి వీడియోనే ఈ నక్కది కూడా. ఈ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసిన వ్యక్తి పేరు ఆండీథార్న్. ఇతను తనకు ఇష్టం అయిన సంగీతాన్ని బాంజోతో వాయిస్తున్నాడు. అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అయితే అతను వాయిస్తున్న సంగీతం విని ఓ నక్క ఉన్నట్టుంటి అక్కడకు వచ్చింది. ఆ సంగీతానిక మంత్ర ముగ్దురాలు అయినట్లుగా ఏంతో చక్కగా విన్నది. దీనినే ఆ వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
సాధారణంగా ఏ నక్క అయినా మనిషిని చూసిన వెంటనే చాలా దూరం పారిపోద్ది. కానీ ఆ నక్క మాత్రం ఆ సంగీతం పూర్తి అయ్యేంత వరకు కదల లేదు. నక్క ఉత్సాహం చూసిన ఆ వ్యక్తి కూడా మరింత వినసొంపుగా వాయించడం ప్రారంభించాడు. ఇలా ఆ నక్క తన్మయత్వం చెందడం చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ నక్క సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.