మినుములు, కందులు, పెసర్లు, శనగలు వంటి పప్పు ధాన్యాలు తరచూ అందరూ తింటూనే ఉంటారు. ఈ పప్పుల్లో, చిక్కుడు జాతి పప్పుల్లో పీచు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి వెంటనే కడుపు నిండినట్లు చేస్తాయి. అంతేకాదు ఆకలిని కూడా త్వరగా దరిచేరనివ్వవు. ఈ పప్పు ధాన్యాలు శరీరానికి బలాన్ని కూడా చేకూరుస్తాయి. దీంతో జబ్బులను తట్టుకునే శక్తి ఈ ధాన్యాలకు ఉంటుంది. కాబూలీ శనగల్లో ఉండే పీచు రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉండేలా తోడ్పడతాయి. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గడానికి తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గెండె జబ్బులూ దూరం అవుతాయి.
కందులు, పెసర్లు, వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణమూ ఉంటుంది. రాజ్మా పప్పుల్లో విషయగ్రహణ శక్తిని పెంపిందించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగా క్యాన్సర్ ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు, అల్ట్రైమర్స్ బారిన పడకుండా చూసే థైమీన్ కూడా పుష్టిగా ఉంటాయి.
ఉలవల్లో ఐరన్, క్యాల్షియం వంటివి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గల ఫాలీ ఫెనాల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయ రోగనిరోధ చర్యల్లో కనిపించే హీమగ్లుటినివ్ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గడానికి తోడ్పడతాయి. సోయాబీన్స్ గింజల్లోనూ అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి కూడా బాగా కృషి చేస్తాయి. వీటిని మాత్రం పరిమితంగా తినాల్సి ఉంటుంది.