మొట్టమొదటి కరోనా కేసు వెలుగు చూసి సుమారు మూడేళ్లు కావొస్తోంది. దీని వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొన్ని ప్రపంచంలోని చాలా దేశాలు ఆంక్షలను అమలు చేశాయి. దీని ప్రభావం ఉద్యోగస్తులు పైన భారీగానే పడింది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా పుట్టుకువచ్చిందే.. వర్క్ ఫ్రం హోమ్. కొవిడ్ పుణ్యమా అని ఈ పద్దతిని చాలా రంగాల కంపెనీలు ఫాలో అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉండే వారు అయితే వర్క్ ఫ్రం హోంనే నమ్ముకున్నారు. ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం ను ఓ వ్యక్తి బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఏడాదికి ఏకంగా 5 కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు.
కొవిడ్ కాలంలో కూడా భారీగా లాభాలను ఆర్జించిన కంపెనీలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలు అనే చెప్పాలి. అందుకే ఉద్యోగస్తులకు కూడా భారీగా జీతాలు ఇస్తుంటాయి. కొవిడ్ కష్టకాలంలో కూడా వీరికి అన్నీ సదుపాయాలతో వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. దీంతో ఓ యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి భారీగా సంపాదనను ఆర్జిస్తున్నాడు. ఏకంగా ఏడాదికి 5 కోట్ల రూపాయిలను సంపాదిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.
ఇంటి దగ్గర నుంచి పని చేయడంలో ఇబ్బంది ఉన్నా కానీ వాటిని అధిగమించి భారీగా ఆదాయాన్ని గడిస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను ఏమి ఒకే సంస్థలో పని చేసి ఈ మొత్తం పొదడం లేనది… మొత్తంగా ఆరు కంపెనీలకు పని చేస్తున్నట్లు చెప్పాడు. అది కూడా పుల్ టైం కావడం గమనార్హం. వర్క్ ఫ్రం హోం కాబ్టటి ఇలా నడిపిస్తున్నానని పేర్కొన్నాడు. ఇలా ఈ వ్యక్తి కష్టపడడానికి ఉన్న కారణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తాను ఎప్పటికైనా మిలీనియర్ కావాలని ఉందని… అందుకే ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఇంతలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాకుండా కేవలం 40 సంవత్సరాలకే పదవీ విరమణ పొందాలని ఉందంటున్నారు. ఇందుకుగానూ పెద్ద మొత్తంలో సొమ్ము సంపాదిస్తున్నట్లు తన బ్లాగ్ లో రాసుకువచ్చాడు.