భారత దేశం అనేక సంప్రదాయాలుకు, సంస్కృతులకు నెలవు. ఒక్క ప్రాంతంలో ఒక్కోక్క భాషా, ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఒకరి సంప్రదాయం మరోకరికి వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి ఆచార వ్యవహారాలు రా బాబూ అని అనుకునేలా ఉంటాయి. ఇలాంటి సంప్రదాయం ఒకటి మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉంది.ఇది వినేందుకు మాత్రమే కాదు చూసేందుకు కూడా చాలా వింత గా ఉంటుంది. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటి అని అనుకుంటున్నారా..
ఈ రోజు హోలీ పండుగ. ఈ పండుగను ప్రపంచంలో చాలా మంది రంగులను పూసుకుంటూ జరుపుకుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో కోలాహలంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ఇదే పండుగ నాడు ఓ సంప్రదాయం ఉంది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో.. అది ఏంటి అంటే ప్రతీ హోలీ పండగ రోజు కొత్త అల్లుడిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఇలా గ్రామం అంతా తిప్పుతారు. ఈ ఆచారం సుమారు 80 ఏళ్ల నుంచి వస్తుందని చెప్తున్నారు అక్కడి గ్రామస్తులు. దీనికంటూ ఓ ప్రత్యేక కథ ఉందని చెప్తున్నారు.
అది ఏమిటంటే… జిల్లాలోని ఓ దేశ్ ముఖ్ అనే వంశానికి చెందిని ఓ అల్లుడు పండుగ రోజు రంగులు పూయించుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో అతని మామా కొత్త అల్లుడు అని కూడా చూడకుండా.. పక్కన ఉన్న గాడిద మీద ఊరేగించారు. ఇలా చేసి అల్లుడిని గ్రామంలోకి తీసుకుని వచ్చాడు. అప్పటి నుంచి ఇదే ఆచారం అందరి అల్లుళ్లకు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.