Site icon 123Nellore

సగ్గు బియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం గ్యారెంటీ!

Health Tips: సాధారణంగా సగ్గుబియ్యం అనగానే అందరూ అదేదో పంట నుంచి వచ్చిందని, మొక్కలకు పండుతుందని అనుకుంటారు. కానీ ఇది కర్రపెండలం అనే దుంప నుండి కొన్ని మిషన్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని వంటకాల్లో ఇది ప్రధానంగా వాడుతారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సగ్గుబియ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips

జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది: సగ్గుబియ్యం తినడానికి పిల్లలు అస్సలు చిరాకు పడరు. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ సగ్గుబియ్యం తీసుకోవడం చాలా మంచిది. ఈ సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి పంచదార కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ కలిగి జీర్ణ సమస్యలన్నీ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

పోషకాంశాలు: సగ్గుబియ్యం లో కాల్షియం మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి,లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వంద గ్రాముల సగ్గుబియ్యం 335 క్యాలరీలు, 94గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఫాట్స్ ప్రోటీన్లు తగినంత కలిగి ఉంటాయి. కొన్ని ప్రధానమైన హెర్బల్ మెడిసిన్స్ లో వీటిని వాడుతారని తెలుస్తుంది.

వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తాయి. సగ్గుబియ్యం తో బియ్యం జతచేసి ఉడికించి తీసుకోవడం వల్ల వేడి తో బాధపడే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఈ సగ్గుబియ్యం శరీరానికి ఎనర్జీ లేని సమయాలో సేవించడం వల్ల వాళ్లు తిరిగి రిఫ్రెష్ అవుతారు. ఇది మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.

Exit mobile version