Site icon 123Nellore

మన శరీరానికి విటమిన్ డి అందాలి అంటే ఎంత సేపు ఎండలో ఉండాలో తెలుసా?

సాధారణంగా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు మినరల్స్ అవసరమవుతాయి. ఇవన్నీ మన శరీరానికి సరైన మోతాదులో అందినప్పుడే మనం ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలము. ఈ విధమైనటువంటి విటమిన్స్ అన్నింటినీ మనం ఆహార పదార్థాల ద్వారా పొందగలము. అయితే మనకు సహజ సిద్ధంగా లభించే టువంటి విటమిన్-డి సూర్యుడు నుంచి కూడా లభిస్తుంది.ఈ క్రమంలోనే చాలా మంది ఉదయం నిద్రలేవగానే కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది అని చెబుతారు. అయితే సూర్యుడు నుంచి విటమిన్ డి పొందాలంటే మనం ఏ సమయం వరకు ఎండలో కూర్చోవాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా ఉదయం సూర్యుడు కిరణాల నుంచి విటమిన్-డి వెలువడుతుంది. ఈ క్రమంలోనే ఉదయం ఎనిమిది గంటలలోపు ఒక అరగంట పాటు ఎండలో కూర్చోవటం వల్ల ఆ సమయంలో అధిక మొత్తం విటమిన్ డి మన శరీరానికి అందుతుంది. అలాగే సూర్యాస్తమయం సమయంలో అరగంట పాటు ఎండలో ఉండటం వల్ల మన శరీరానికి సూర్యుడి నుంచి వెలువడే సహజసిద్ధమైన విటమిన్ డి పొందవచ్చు.

ఈ విధంగా సూర్య కాంతి నుంచి మన శరీరానికి కావలసిన మెలటోనిన్ సెరటోనిన్ డోపమైన్ మనల్ని మానసికంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహకరించడమే కాకుండా అధిక ఒత్తిడి డిప్రెషన్ నుంచి మనల్ని బయటపడేస్తుంది. అలాగే సూర్యకాంతిలో ఉన్నటువంటి యువిఏ రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి శ్వాసక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ డి మన శరీరానికి రోగనిరోధక శక్తితో పాటు శరీరానికి కావలసిన శక్తిని కూడా అందించడానికి దోహదపడుతుంది. కనుక ప్రతిరోజు ఉదయం అరగంట పాటు ఎండలో కూర్చోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version