ప్రస్తుత కాలంలో చాలా మంది కాఫీ టీ వంటి వాటిలో చక్కెరను విరివిగా ఉపయోగిస్తున్నారు.అదే పూర్వకాలంలో పెద్దవారు ఏదైనా తీపి పదార్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా బెల్లం మాత్రమే ఉపయోగించేవారు. అందుకే అప్పటి కాలంలో వారు ఎంతో ఆరోగ్యవంతంగా దృఢంగా ఉండగలిగారు.కానీ ప్రస్తుతం విరివిగా చక్కెరను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే కేవలం బెల్లం తినకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు.కానీ ప్రతి రోజు ఒక బెల్లం ముక్క తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం….
మన ప్రేగులలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించి ప్రేగులను శుభ్రపరుస్తుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బెల్లం కీలక పాత్ర వహిస్తుంది. అలాగే స్త్రీలలో వచ్చే సమస్యలను నివారించడానికి కూడా బెల్లం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. రక్తంలో ఉన్నటువంటి మలినాలను శుద్ధి చేసి బయటకు పంపించడంలో బెల్లం ముఖ్య పాత్ర వహిస్తుంది కనుక ప్రతిరోజు ఒక ముక్క బెల్లం తినడం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలు అన్నింటిని పొందవచ్చు.