మహిళా కమిషన్ చైర్‍పర్సన్ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే సమన్లు ఇవ్వకపోతే.. చప్పట్లు కొడతారా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పరామర్శకు వచ్చారా.. దాడికి వచ్చారా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తన కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘బాధితురాలికి ఓదార్పును ఇవ్వాలి కానీ.. భయపెట్టకూడదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి.. పరామర్శ ఎలా చేయాలో తెలియదా?. మానవత్వం లేకుండా రాజకీయాలు చేస్తారా?. బాధితురాలి దగ్గర రాజకీయాలు చేస్తారా?. బాధితురాలి దగ్గర బల ప్రదర్శనలేంటి? అరుపులు, కేకలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో హంగామా సృష్టించారు. మహిళా కమిషన్ డమ్మీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా కమిషన్ డమ్మీ కాదు.. పవర్ ఫుల్.
మహిళా కమిషన్ ఏమైనా సుప్రీమా అంటూ సవాళ్లు విసురుతున్నారు. మహిళా కమిషన్ పవర్‍ను చంద్రబాబు గుర్తించాలి. 27న చంద్రబాబు రావాలి.. సమాధానం చెప్పాలి. మహిళల పట్ల టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు హయంలో మహిళ కమిషన్‌ను తూ తూ మంత్రంగా, ఆటబొమ్మలా తయారు చేశారని విమర్శించారు. మహిళ కమిషన్ సుప్రీం ఆ… అని బోండా ఉమ లాంటి ఆకు రౌడీ అన్నారన్నారు. అవును సుప్రీం నే….మీ హయంలో మహిళ కమిషన్ కన్నీళ్లు పెట్టుకోవడానికి ఉంది…. ఇప్పుడు కన్నీళ్ళు తుడవడానికి ఉంది.
బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదా. మీరు ఏమైనా దేవుళ్ళా… అత్యాచార బాధితురాలి దగ్గర మీరు అలా వ్యవహరిస్తారా. మీ వ్యవహారానికి సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మహిళ కమిషన్ పవర్‌ను మీరు గుర్తించాల్సిందే. వారు చేసింది యుద్దామా పరామర్శ…ఆలోచించుకోవాలి. బాధితురాలు మీద, నా మీదా…. మీ బలప్రదర్శన. మహిళ కమిషన్ మీద న్యాయస్థానంలో తేల్చుకుంటాం అంటారు. అంటే మహిళ కమిషన్‌ను మీరు డమ్మీ అనుకుంటున్నారా. మహిళ కమిషన్ రెక్కలు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా.?’’ అని మండిపడ్డారు.