Site icon 123Nellore

అతిగా శీతల పానియాలు తాగుతున్నారా..అయితే ఈ ప్రమాదాలు తప్పవు…!

ఎండాకాలం వచ్చేసిందంటే చాలు అందరి చూపు శీతలపానియాలపైనే ఉంటుంది. ఎండ తీవ్రత నుండి ఉపశమనం కోసం వీటిని తాగుతారు. ఎండ ధాటికి ఒంట్లో చల్లదనాన్ని నింపుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ శీతల పానియాలను ఇష్టపడతారు. ఈ శీతల పానియాలు రకరకాలు ఉంటాయి. కొన్ని కెమికల్స్ వల్ల ఉండేవి అయితే..మరి కొని సహజంగా లభించేవి. ఒక రకమైనే కాకుండా అన్ని రకాల శీతల పానియాలకు ప్రియారిటీ ఇస్తారు. చల్లగా ఉంది కదా అని ఇష్టానుసారంగా తాగితే పప్పులో కాలేసినట్లే. శీతలపానియాల వల్ల శీరర పరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

చల్లటి పానియాలు పంటికి హాని కలిగిస్తాయి. సోడాల్లో ఫాస్పరిక్, కార్బొనిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇవి రెండు దంతాక్షయానికి కారణమవుతాయి. పళ్ల ఎనమిల్‌ను డ్యామేజ్‌ చేస్తుంది. చక్కెరతో కూడిన యాసిడ్‌ బ్యాక్టిరియాకు అవసరమైన వాతావరణం. ఇది క్యావిటీకి కారణమవుతుంది. ఇక మధుమేహం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది.  అంతేకాదు..ఇందులో ఇన్సులిన్ వేగంగా విడుదల అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ దెబ్బతినడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

శీతలపానియాలు ఎక్కువగా తీసుకుంటే వేగంగా బరువు కూడా పెరుగుతారు. ఎందుకంటే వీటిల్లో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగడంలో  పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఒక గ్లాసు శీతల పానియంలో ఎనిమిది నుండి 10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. అదే విధంగా శీతల పానియాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిదికాదు. ఒక గ్లాస్ కూల్ డ్రింక్ లో దాదాపు 150 నుండి 200 కేలరీలు ఉంటాయి. ప్రతి రోజూ చాలా కేలరీలు తీసుకోవడం వల్ల  బరువు పెరుగుతుంది. దీంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.

 

Exit mobile version