Site icon 123Nellore

మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు తినకూడదని మీకు తెలుసా?

సాధారణంగా మందు బాటిల్స్ మీద మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని మెన్షన్ చేసి ఉంటుంది. కానీ మందుబాబులు మద్యం తాగితేనే ఆరోగ్యం మరింత బాగుపడుతుందన్నట్టు తాగుతారు. వారు బాధలో ఉన్న మనసు ముందు వైపే.. లాగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నా మనసు మందు వైపే లాగుతుంది. ఇక వాటికి తోడు మంచింగ్ కోసం కొన్ని స్పైసీ వాటిని తీసుకుంటారు.

Alcohol

కానీ ఇలా మద్యం సేవించేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. అవేమిటంటే.. చాలామంది మద్యం సేవించె సమయంలో స్టఫ్ పేరుతో వేరుశెనగలు, జీడిపప్పు ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఈ రెండిటిలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

మద్యం సేవిస్తున్న సమయంలో వీటిని తీసుకోవడం వల్ల వాంతులు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మద్యం సేవించేటప్పుడు చిప్స్ ను స్టఫ్ లోకి ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ చిప్స్ తినడం ద్వారా మరింత దాహం వేస్తోంది. దాంతో ముందు బాబులు మరింత ఎక్కువ మందు తాగుతారు. మద్యం తీసుకునేటప్పుడు, అయిపోయిన తర్వాత జిడ్డు ఉండే పదార్థాలను తినకూడదు.

అలా చేస్తే కడుపులో గ్యాస్, మంట లాంటి సమస్యలు పెరుగుతాయి. కొంతమంది మద్యం సేవించే సమయంలో వెరైటీగా జున్ను తింటూ ఉంటారు. ఇది ఆ టైంలో విషం అనే చెప్పవచ్చు. ఎందుకంటే పాలతో తయారయ్యే వస్తువులను మద్యం సేవించే సమయంలో తీసుకుంటే జీవక్రియను దెబ్బతీసి.. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.

Exit mobile version