Site icon 123Nellore

థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. యుద్దానికి అందరూ సిద్ధంగా ఉండండి: సీఎం

దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నాము అనుకుంటున్న క్రమంలోనే ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఢిల్లీ, యూపీ తో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్, మరొకవైపు కరోనా వైరస్. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలయింది అనే సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 47 కేసులు నమోదు కావడంతో కోవిడ్ 19 థర్డ్ వేవ్ మొదలైంది అని భావిస్తున్నట్లు నితీష్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలలో రాత్రి సమయాలలో కర్ఫ్యూ లి అమలులోకి వచ్చినా బీహార్ లో అప్పుడే అలాంటి పరిస్థితి రాదని, పరిస్థితిని బట్టి దీనిని దీనిపై ఆలోచిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో మొత్తంగా 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 167, గుజరాత్ లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పటివరకు బీహార్ లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. థర్డ్ వేవ్ మొదలయింది అంటూ సీఎం ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అంతేకాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్న అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.ముఖ్యంగా పొరుగున ఉన్న యూపీ, ఢిల్లీ నుంచి రాకపోకలే కేసులు పెరగడానికి కారణమని అంచనాకు వచ్చారు.

Exit mobile version