పలు వాయిదాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నేడు(ఏప్రిల్ 29) థియేటర్లోకి వచ్చింది. మల్టీస్టారర్ అంటేనే ఆ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ఒకే సినిమాలో కనిపంచడమంటే హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన ఆచార్య మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటుంది. మెగాఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుందని.. కానీ జెనరల్ ఆడియన్స్‌ని ఈ సినిమా మెప్పించలేక పోయిందని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే ఓవైపు థియేటర్లలో ఆచార్య సందడి చేస్తుండగా.. మరోవైపు ఆచార్య ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్స్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలో రానుందని టాక్. మే చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలను ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’, ‘గని’ సినిమాల విషయంలో ఇలానే జరిగింది. మరిప్పుడు ‘ఆచార్య’ను కూడా మూడు వారాల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
ఈ సినిమా కాకుండా.. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్… డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.