విమాన ప్రమాద ఘటనలను మనం చాలా చూసి ఉంటాం. కొన్ని అడవుల్లో పడిపోగా మరికొన్నింటికి ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రమాదం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ రన్ వేపై ఓ కార్గో విమానం రెండు ముక్కలైంది. జర్మన్‌కు చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్‌పోర్ట్ అనుమతి కోరగా, అందుకు అనుమతి వచ్చింది.
దీంతో పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. విమానం నుండి ముందుగా పొగలు వెలువడ్డాయి. ఆ తరువాత అది ఆగిపోయింది. వెనుక చక్రాల మీదుగా గుండ్రంగా తిరిగుతూ రెండుగా విడిపోయింది. అదే సమయంలో రన్‌వే నుండి పక్కకు జారిపోయింది.రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది బాగానే ఉన్నారని కోస్టా రికా అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ముందుజాగ్రత్తగా సిబ్బందిని “వైద్య పరీక్షల కోసం” ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో పైలట్ షేక్ అయ్యాడు. కానీ సిబ్బంది ఇద్దరూ స్పృహలోనే ఉన్నారు అని అధికారులు తెలిపారు.
En aeropuerto de Costa Rica, avión de la empresa DHL se parte en 2 tras salirse de la pista, los 2 tripulantes que iban a bordo se reportan estables.#DHL#CostaRica#Accidente#AcustikNoticias pic.twitter.com/Tr600mfA9W
— Acustik Informa (@AcustikInforma) April 8, 2022
ల్యాండింగ్ సమయంలో విమాన ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో ముందస్తు చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ఏవియేషన్ సోర్స్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా… ఇవి వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.