గుమ్మడి కాయకు ఆంధ్రులకు విడదీయరాని సంబంధం ఉంటుంది. దీన్ని ఎక్కువగా పల్లెల్లో వినియోగిస్తారు. తొలిఏకాదశి, వినాయక చవితి నాడు చేసే కుడుముల్లో ఈ గుమ్మడి కాయతో చేసిన కూరను వినియోగించుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో దీని వాడకం పక్కనబడింది. కారణం వీటి ఉపయోగం ఏంటో తెలియడం తక్కువైంది కాబట్టి. ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువుగా ఉండటం వల్ల కాన్సర్ పేషెంట్లు తీసుకునే ఆహార జాబితాలో చేర్చారు అయితే ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నియంత్రించే గుణం కలిగి ఉంటుంది.
కంటి చూపునకు, చర్మానికి నిఘారింపునకు మేలు చేస్తుంది. విటమిన్ సి కుడా బాగా లభిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి తింటే ఎంతో మంచి చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. గుమ్మడిలో ఎక్కువగా పీచు పదార్ధం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
అవి ఏంటంటే మలబద్ధకం నుండి మధుమేహం తగ్గించే వరకు అన్ని గుణాలు ఇందులో ఉన్నాయి. చైనాలో షుగర్ వల్ల వ్యాపించే వ్యాధుల పరిష్కారానికి గుమ్మడి కాయ వాడతారు. అలాగని అందరికీ సెట్ కావండోయ్. ఎందకంటే పీచుపదార్థాలు కొందరికి తినబుద్ధి కాదు. దీని వల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నవారికి గుమ్మడికాయ తగిలించకపోవడం మంచిది. ఒంట్లో కొవ్వు రాకుండా ఉండటం కోసం గుమ్మడి విత్తనాలు తింటే నివారిస్తుంది. కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది.
గమనిక : వైద్యుల సూచనలు అనంతరం పాటిస్తే మంచిది