టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లు చేయడం మొదలయ్యాయి. అదేవిధంగా ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లు ఎన్నో రకాలుగా ఎంతో మందిని మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసిన పరిస్థితుల గురించి మనం వినే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఇలాంటి మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వాట్సాప్ ను అడ్డాగా మార్చుకుని యూజర్లను మోసం చేస్తున్నారు.
ఇలా మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ తెలియజేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టగానే మీ వివరాలను సైబర్ క్రిమినల్స్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఆ వివరాలతో వాళ్లు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం దోచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వాట్సాప్ చూసేవాళ్లు పొరపాటున కూడా ఈ విధమైనటువంటి లింక్ రాగానే దానిపై క్లిక్ చేయకండి. పొరపాటున ఈ లింకు క్లిక్ చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవ్వడం ఖాయం.