Site icon 123Nellore

నల్ల జామకాయ గురించి మీకు తెలుసా.. నల్ల జామ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా జామకాయ అనగానే జామ చెట్టు బెరడు ఆకులు కాయలలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ రకాల సమస్యలతో బాధపడేవారు జామ ఆకుల నుంచి జామకాయల నుంచి విముక్తి పొందుతారు. ఈ క్రమంలోనే జామకాయలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా మన ఇంటి ఆవరణంలో కూడా జామ చెట్లను పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాము. జామకాయ అంటే సాధారణంగా చాలా మంది ఆకుపచ్చరంగు లేదా తెలుపు రంగులో ఉండే జామకాయలను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నలుపు రంగులో ఉండే జామకాయలు చూశారా.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న నలుపు రంగు జామకాయలు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణ జామకాయల కంటే రెట్టింపు శాతంలో పోషకాలను కలిగి ఉండటం వల్ల దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.ఇకపోతే ఈ కాయ బయట వైపు చూడడానికి నలుపురంగులో ఉన్నప్పటికీ లోపల మాత్రం గులాబి రంగులో ఉంటుంది. జామకాయలో అధికభాగం యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి.

ఈ విధమైనటువంటి నల్ల జామ కాయలు తినడం వల్ల ఇందులో ఉన్న ఐరన్ మన శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి దోహదపడుతుంది రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది.ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటిచూపు సమస్యల నుంచి మనల్ని రక్షించడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా కలిగినటువంటి ఈ జామకాయ తినడం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.ఈ జామ కాయలు తినడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది.ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ జామపండును తినడం వల్ల మన చర్మం పై ఏర్పడిన ముడతలు తొలగిపోయి నిత్యం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

Exit mobile version