Site icon 123Nellore

నోట్ల మార్పిడి ఇబ్బంది నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు

500 మరియు 1000 రూపాయల పాత నోట్ల స్థానంలో క్రొత్త నోట్లను తీసుకోవడంలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వాట్సాప్, ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు, ఛలోక్తులు విస్తరిస్తున్నాయి, ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వేలికి ఇంకు మార్క్ గురించి వాట్సాప్ లో ఓ ఆడియో తెగ వైరల్ అవుతున్నది. ఆ ఆడియో ని పలువురు షేర్లు చేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. ఆ ఆడియో లో ఏముందంటే…. 
“హలో… నా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం ఓ మంచి ఐడియా ఉంది. ఏంటంటే ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా వేలి పైన ఇంక్ వేసి పంపిస్తున్నారు. కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆ ఇంక్ తుడుచుకోవడం కాని లేక ఓ నాలుగైదు రోజులు వారంలో మళ్ళీ వచ్చి డబ్బులు తీసుకోవడం వల్ల వేరే వాళ్లకు ఇబ్బంది అయ్యి జనాలకు డబ్బులు దొరకక బాగా కష్టపడుతున్నారు. సో ఆ ఇంకు ఐడియా కాకుండా నా దగ్గర ఇంకా మంచి ఐడియా ఉంది. అదేంటంటే డబ్బులు కోసం వచ్చిన వాళ్ళకు ఇంకు వేయడం కాదండీ (…. నవ్వుతూ) గుండు చేయండి. గుండు చేస్తే…. డబ్బులు తీసుకున్న వాళ్లకు గుండు చేస్తే జుట్టు రావడానికి కనీసం ఇరవై, ముప్ఫై రోజులు పట్టిద్ది, అప్పటికి మన సిస్టమ్ సెట్ అయిపోద్ది. ఎందుకంటే వాడు రెండో సారి రాలేడు, ఆ ఇంకుని తుడుచుకోలేడు, జుట్టుని తెచ్చుకోలేడు, విగ్గు పెట్టుకోలేడు, విగ్గు కొనాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు  కాబట్టి. గుండు చేయడం అనేది మంచి ఐడియా. సో ఎవరైతే డబ్బులు కోసం బ్యాంకులకు వస్తారో ప్రతి బ్రాంచి లో వాళ్ళందర్నీ లైన్ గా గుండు చేయడం – డబ్బులు ఇవ్వడం, గుండు చేయడం – డబ్బులు ఇవ్వడం. ఇది చేస్తే జనాలు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇవ్వవచ్చు ప్లస్ మన భారతదేశంలో 99 పర్సెంట్ అందరూ గుండ్లు అయి తిరుగుతుంటారు ఎందుకంటే డబ్బున్న వాడు బ్లాక్ లో మనీ ఉన్నోడు బ్యాంకుకు రాడు కాబట్టి వాడికి విగ్గు ఉండిద్ది ప్లస్ మనకు తెలిసిపోద్ది డబ్బున్న వాడు ఎవడు, డబ్బు లేని వాడు ఎవడు. డబ్బున్న వాళ్ళకి జుట్టు ఉండిద్ది, డబ్బు లేని వాళ్ళందరూ గుండు తో తిరుగుతుంటారు.. సో ఎంతమంది గుండు ఉన్నారో వాళ్ళందరూ మంచి వాళ్ళు. జుట్టున్న వాళ్ళు దొంగలు అని మనం తెలుసుకోవచ్చు. సో నా ఐడియా నచ్చిన వాళ్ళు ఫార్వార్డ్ చేయండి. థాంక్యూ.”  
Exit mobile version