Site icon 123Nellore

తిరుమల కపిల తీర్ధం ఎంత అందంగా ఉంటుందో తెలుసా ?

 

తిరుమలలో శ్రీవారు అంటే తెలియని వారు ఉండరు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికీ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మన దేశానికి వచ్చారు అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా వెళ్ళరు. శ్రీవారంటే అంత భక్తి.. అయితే ప్రసిద్దిగాంచిన ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్ర స్థలం మరొకటి ఉంది.. అదే కపిలతీర్థం.

తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన ఈ తిరుపతిలో ఓ శివాలయం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంలో, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి వైపు వెళ్తే ఈ అద్భుతమైన శివాలయం కనిపిస్తుంది.

ఈ ఆలయం ఇక్కడ ఏర్పడటనికి కారణం కపిల మహర్షి. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం చెప్తుంది. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైంది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. చూశారుగా కపిలేశ్వరుడు తిరుమలలో ఎలా వెలిశాడో అనేది.. తిరుమలకు వెళ్తే ఖచ్చితంగా ఈ కపిల తీర్ధానికి వెళ్ళండి.

Exit mobile version