ఎన్టీఆరే నాకు స్పూర్తి అని డొనాల్డ్ ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది. తల తోకా లేకుండా ఎన్టీఆర్ కు డొనాల్డ్ ట్రంప్ కు ఎక్కడన్నా సంబంధం ఉందా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ప్రాంతానికే కాదు విదేశానికి చెందింది కాబట్టి. అసలు విషయానికొస్తే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క అమెరికన్ డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించారు.అయితే ఈ ప్రకటన వెనక నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఉన్నట్లు తెలుస్తోంది. తాను సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరూపాయి మాత్రమే తీసుకుంటానని ఎన్టీఆర్ హామి ఇచ్చారు. అన్నట్లుగానే ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు . అయితే ఇదే విషయాన్ని అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి ట్రంప్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రంప్ ఎన్టీఆర్ స్పూర్తిగా తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అందుకే తన జీతం తాను ఒక్క అమెరికన్ డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించి ఆందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడికి సంవత్సరానికి (రూ. 2.60 కోట్లు) వేతనంగా ఇస్తారు. ట్రంప్ మాత్రం అమెరికన్ ఒక్క డాలర్ (దాదాపు రూ. 65 రుపాయలు) వేతనంగా తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.