Site icon 123Nellore

ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్…?

 ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఎంతో అవసరం. బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలను మనం పొందే అవకశం ఉంటుంది. డబ్బులు దాచుకోవడం కోసం, ఇతర అవసరాల కోసం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. మనలో చాలామంది అవసరాలను బట్టి ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. అయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానిని క్లోజ్ చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో మినిమం బ్యాలన్స్ ఉండాలి. మినిమం బ్యాలన్స్ లేకపోతే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. తరువాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలని భావించినా పెనాల్టీ చెల్లించి మాత్రమ్రే క్లోజ్ చేయాలి. అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే వాటికి సంబంధం ఉన్న అన్నింటినీ డీ లింక్ చేసుకోవాలి. రెండు మూడు బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలన్స్ ఉంచటం కంటే ఒకే బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలన్స్ ఉంచటం మంచిదని… చాలా బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటి వివరాలను కూడా ఆదాయపు పన్నుశాఖకు సమర్పించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version