దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రైతులకు మరో తీపికబురు చెప్పింది. రైతులకు ఉపయోగపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ యోనో యాప్ కు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ కు కిసాన్ క్రెడిట్ రివ్యూ అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ వల్ల రైతులు బ్యాంకుకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే తమ పనులను సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. రైతులు ఇంటి నుంచే కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ను కూడా పెంచుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే రైతులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. 75 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతులు కేసీసీ రివ్యూ సులభంగానే వారి లిమిట్ ను రివైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ రైతుల కోసం యోనో కాటా, యోనో సేవింగ్స్, యోనో మిత్ర, యోనో మండి వంటి వాటి ద్వారా సైతం ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.