ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్ల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు హీరోలు.
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా ? అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ… మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని చెప్పారు. నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య సినిమాల విషయంలో ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ మేమిద్దరం (రామ్ చరణ్, ఎన్టీఆర్) మంచి స్నేహితులమని… మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అన్నారు. మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారని… ‘ఆర్ఆర్ఆర్’ తరువాత అందరూ ఒకే తాటిమీదకు వస్తారని, భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు ఎన్టీఆర్. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ… ఆయన కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, తన జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని చెప్పారు.