Site icon 123Nellore

నాలుగు పై నల్ల మచ్చలు ఉన్నాయా అయితే వాటిని ఇలా చెక్ పెట్టండి!

Black spots : మామూలుగా మనకు శరీరం పై పలుచోట్ల పుట్టుమచ్చలు, నల్ల మచ్చలు వంటివి ఉంటాయి. ఇక అవి చెరిపిన చెరిగిపోని మచ్చలుగా ఉంటాయి. అలా నాలుక పై కూడా కొన్ని మచ్చలు ఉంటాయి. కానీ ఇది చాలా మందిలో కనిపించవు. కొందరిలో మాత్రమే ఈ మచ్చలు ఉంటాయి. వీటివల్ల తాము ఇతరులతో మాట్లాడాలంటే ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి వీటిని తొలగించడానికి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Black spots

వేప: వేప బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సహజమైన స్టెయిన్ రిమూవర్ లా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఒక కప్పు నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించాలి, ఆ నీటితో నోటిని పుక్కిలించడం చేస్తే నాలుక పైన మచ్చలు పోతాయి. ఇలా ప్రతిరోజూ చేయడం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది.

పైనాపిల్: పైనాపిల్ లో ఎక్కువగా ఉండే బ్రోమెలైన్ ఇది నల్ల మచ్చలను తొలగించడానికి సహాయ పడుతుంది. అంతేకాకుండా నాలుకను డెడ్ స్కిన్ సెల్స్ భారీ నుండి తప్పిస్తుంది. కనుక ప్రతిరోజూ పైనాపిల్ తీసుకోవడం ద్వారా నల్ల మచ్చలు పూర్తిగా తగ్గించవచ్చు.

కలబంద: కలబంద కొల్లాజెన్ నిర్మాణాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. దీని వల్ల మచ్చలు కూడా వేగంగా నయం అవుతాయి. కాబట్టి అలోవెరా జెల్ ను నాలుక పై ఉన్న మచ్చల పై అప్లై చేస్తే క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాకుండా కలబంద రసం కూడా తీసుకోవచ్చు. ఇక దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు కూడా నల్ల మచ్చలు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

Exit mobile version