Site icon 123Nellore

నీ పాలనలో ఆ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశావ్​గా- ఉమాశంకర్​

వైకాపా ఎమ్మెల్లే పెట్ల ఉమాశంకర్​ గణేశ్​ తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిపై మాటల తూటాలు విసిరారు. అయ్యన్న పాత్రులు పిచ్చి ప్రేలాపన మానుకోవాలని.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై పిచ్చి కూతలు కూస్తున్న అయ్యన్న పాత్రుడు ఎలాంటి వాడో అందరికీ తెలుసని.. ఒక ఆర్థిక నేరస్థుడు ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు అయ్యన్నకు ఎన్ని ఆస్తులున్నాయో.. ఇప్పుడు ఎంత సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాయలసీమ ప్రజల మూడు రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు, లోకేశ్​ కలిసి అయ్యన్నతో రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియా వేసే మేత కోసమే అయ్యన్న పాత్రుడు మందు కొట్టి మరీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. ఆయనవన్నీ మత్తుమాటాలే కానీ.. మతితో అన్న మాటాలు కాదని విమర్శించారు. చాలా కాలం పాటు మంత్రిగా ఉన్న అయ్యన్న.. నర్సీపట్నాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని అన్నారు.

జగన్​ ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారని.. అలాంటి వాళ్లను రాజీనామా చేయమని అనడం సిగ్గుచేటని అన్నారు. 2019 ఎన్నికలతో పాటు జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసిన చంద్రబాబు వాళ్ల కుమారుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలా చంద్రబాబు, అయ్యన్న పాత్రుడిపై మాటలతో విరుచుకుపడ్డారు ఉమాశంకర్​.

Exit mobile version