Site icon 123Nellore

జనసేన వర్సెస్ వైసీపీ.. మరి టిడిపి సంగతేంటి?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయలలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇతర పార్టీలు టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు బిజెపి టిడిపి పార్టీలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. ఈ విమర్శల కారణంగా వైసీపీ ప్రభుత్వం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం బిజెపి తెలుగుదేశం పార్టీల వ్యవహారం పక్కకి వెళ్లడంతో వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ జనసేన రంగంలోకి దిగింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల అప్పట్లో సైలెంట్ గా ఉండడమే కాకుండా ఆ నిర్ణయాన్ని దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు అంటూ మాట్లాడారు.ఇప్పుడు మాత్రం రంగంలోకి దిగి తప్పంతా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ మాట్లాడుతూ, అదేవిధంగా వైసిపి ఎంపీలు సరిగా సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ పూర్తిగా వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు వైసీపీ ప్రభుత్వాన్ని, వైసిపి ప్రభుత్వ ఇమేజ్ ను బాగా దెబ్బతీస్తున్నాయి.

అయితే బీజేపీ టీడీపీ చేసిన విమర్శలకు అంటే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు జనాల్లో చర్చకు రావడంతో పాటు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జగన్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న విమర్శలకు మీడియా కూడా బాగా స్టోరేజ్ కల్పిస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తూ అవి వైసీపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇకపోతే ఈ వ్యవహారాలతో ఒకవైపు వైసీపీ ప్రభుత్వంతో పాటు టిడిపి సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే టీడీపీని ప్రస్తుతం పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధ ఆ పార్టీ అగ్ర నాయకులు స్పష్టంగా కనిపిస్తోంది.

Exit mobile version