Site icon 123Nellore

లోకేష్ పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి

దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఓ మహిళను పరామర్శించేందుకు లోకేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో లోకేష్ ను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు దాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువురు కార్యకర్తలను కంట్రోల్ చేశారు. అనంతరం లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.  ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ పాలన వెయ్యి రోజులు దాటిందని,  వెయ్యి రోజుల్లో 800 మంది మహిళలపై దాడి జరిగిందని ఆరోపించారు.

800 మందిపై దాడి జరిగితే ఏది గన్.. ఏది జగన్ అని, అది తుస్ తుస్ గన్ అయిందని ఎద్దేవా చేశారు. ‘ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు.. యాక్షన్ ఎక్కడ?. నేను అడిగిన తర్వాతే మృతదేహానికి పోస్టుమార్టం మొదలు పెట్టారు. దాడి జరిగి 24 గంటలు అయినా పోస్టుమార్టం ఎందుకు చేయలేదు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయటకు రావాలి. హంతకులను తప్పించేందుకు సురేంద్ర అనే రౌడీషీటర్ ప్రయత్నిస్తున్నాడు. మాపై రాళ్లు విసురుతారా.. మీ అబ్బ జాగీరు అనుకుంటున్నారా?.

పది మందిని కంట్రోల్ చేయలేని పోలీసుల్ని ఏమానాలి? ఏపీలో పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు?. ఎస్పీపై ఎవరి ఒత్తిడి ఉంది.. సమాధానం చెప్పాలి. ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో  కాల్ రికార్డులు బయటపెట్టాలి. బాధిత కుటుంబానికి అండగా నిలబడటానికి మేం వెళ్తే కేసులు పెడతున్నారు.  12 కేసులు పెట్టారు.. మరో పది పెట్టుకోంది.. భయపడేది లేదు.  మీకు దమ్ముంటే 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించండి.. లేదంటే మేం వస్తాం.. ధర్నాకు కూర్చుంటాం’’ అని హెచ్చరించారు. .

Exit mobile version