Site icon 123Nellore

నాటకం మధ్యలో శ్రీవల్లీ పాట.. స్టెప్పులేసి ఇరగదీసిన యక్షగాన కళాకారుడు..!

పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్​ నటించిన సినిమా పుష్పా తెరకెక్కింది. కేవలం తెలుగులో మాత్రమే కాక.. తమిళ్​, హిందీ, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయ్యింది. దీనిలోని ఉండే పాటలు, డైలాగ్స్ ఇండియా మొత్తం మీద ఓ రేంజ్​ లో పేలాయి. అంతే గాకుండా అల్లు అర్జున్​ వేసిన స్టెప్పులు అతని మేనరిజమ్స్ ఉట్టి పడేలా కొన్ని సన్నివేశాలు సినిమాను ఎక్కడకో తీసుకెళ్లాయి. సినిమా రిలీజ్​ అయ్యి చాలా రోజులు అయినా కానీ ఇప్పటికీ జనాల గుండెలను షేక్ చేస్తూనే ఉన్నాయి.

yakshagana artist performs srivalli step

అయితే ఈ సినిమాలో చెప్పుకొ దగ్గ పాట ఒకటి శ్రీవల్లి. అయితే ఈ పాటకు ఓ రేంజ్​ లో మైలేజ్​ వచ్చింది. అదే మైలేజ్​ సినిమాను కూడా అదే స్థాయిలో ఆడేలా చేసింది. ఎంతలా మాయ చేసింది అంటే ఈ పాట వినబడిందంటే చాలు చాలా మంది కళ్ల ముందుకు అల్లు అర్జున్ ప్రత్యక్షమై కాలుని ఈడ్చుకుంటూ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తాడు.

ఇదిలా ఉంటే కర్ణాటకలో సంప్రదాయ కళల్లో ఒకటి అయిన యక్షగానంలో పుష్పా మధ్యలో దూరాడు. ఓవైపు నాటకం జరుగుతుంటే మరోవైపు శ్రీ వల్లి పాట పాడి స్టెప్పులు కూడా వేశాడు. అయితే ఈ యక్షగాన కళాకారుడు శ్రీవల్లీ పాటకు వేసిన స్టెప్పులు నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇది చూసిన చాలా మంది యక్ష గానలో సడన్ గా శ్రీవల్లి ఎలా వచ్చింది అని ముక్కున వేలు ఏసుకుంటున్నారు. దీంతో ఈ  వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Exit mobile version