Site icon 123Nellore

మైనస్​ 53 డిగ్రీల చలిలో మారథాన్… ఎవరు గెలిచారు అంటే?

పురుగు పందాల్లో ఒకటి మారథాన్​. సుమారు 40 కిమీ దూరం ఉంటే దానిని మారథాన్ అని అంటారు. దీనిని సాధించాలి అంటే కొన్ని గంటల పాటు పరుగులు పెట్టక తప్పదు. సుదీర్ఘ దూరం ఉండే ఈ మారథాన్​ న ఛేదించాలి అంటే అందరి వల్ల అయ్యే పని అయితే అసలు కాదు అని చెప్పాలి. ఎంతో శిక్షణ తీసుకుంటే గానీ దానిని పూర్తి చేయలేము. దీనికి పూర్తి చేస్తా చేస్తా.. ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం తెలుసుకోనున్న మారథాన్​ అనేది మరో ఎత్తు అని చెప్పాలి.

World Record Snow Marathon in Siberia

40 కిలోమీట‌ర్ల ఈ పరుగు పందాన్ని పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. అంత‌ దూరం ప‌రుగులు తీయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. అందులోనూ భారీ హిమపాతంలో.. శరీరం గడ్డగట్టుకుపోయే చలిలో… ఉష్ణ్రోగ్రతలు అప్పటికే భారీగా పడిపోయాయి. మైన‌స్ 53 డిగ్రీల చ‌లి ఉంది. దానిలో ప‌రుగులు తీయాడం అంటే సహసమే. ఎందుకుంటే బీపీ బాగా పెరిగిపోతుంది. శ‌రీరం ఐసుముక్కలాగా గ‌డ్డ‌క‌ట్టుకు పోతుంది. మరో వైపు శ‌రీరంపై మంచు దుప్ప‌టిలా క‌ప్పేస్తుంది. ఇలాంటి ఘోర పరిస్థితుల మధ్యలో కూడా మార‌థాన్ ప‌రుగు పందాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు భారీగా పోటీ ప‌డుతుంటారు.

అయితే ఇటీవ‌ల ఇలాంటి ప‌రుగు పందెం ఒక‌టి జరిగింది. అంది ఎక్కడంటే ర‌ష్యాలోని సైబీరియా ప్రాంతంలో. ఆ మారథాన్ ప్రారంభం అయ్యే సమయానికి ఉష్ణోగ్రత భారీ తగ్గింది. సుమారు గా మైన‌స్ 53 డిగ్రీల చ‌లిలో పరుగు పెట్టేందుకు ప్రాంభించారు. సరిగ్గా లక్ష్యం 42.12 కిమీ వరకు ఉంటుంది. ఈ గేమ్​లో సుమారు 62 మంది పాల్గొన్నారు. చలి మైనస్ లో ఉంటూ చంపేస్తున్నా కానీ మారథాన్​ ను పూర్తి చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది ఆ మహిళ. ఆమె పేరు మెరీనా కాగా పురుషుల విభాగంలో ఆ ఫీట్​ ను సాధించింది ర‌ష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ అనే వ్యక్తి. కేవలం 3 గంట‌ల 22 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నారు.

Exit mobile version